అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. సంబరాలు చేస్తున్న నాయకులు
దిశ,పెద్దేముల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉద్యోగుల ప్రస్తావన తీసుకు వచ్చి బుధవారం నుంచి నోటిఫికేషన్.. Latest Telugu News..
దిశ,పెద్దేముల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉద్యోగుల ప్రస్తావన తీసుకు వచ్చి బుధవారం నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీంతో పెద్దెముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు రమేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వెల్లడించిన శుభవార్త విన్న కార్యకర్తలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, సర్పంచ్ శ్రావణ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ధన్రాజ్, యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, నారాయణ, ఇబ్రహీం లాల్ రెడ్డి, ఖానాపూర్ విష్ణు, కొండాపూర్ మదనంతపూర్, మారెపల్లి తండా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.