'దిశ' దిన పత్రికలో వచ్చిన తాళ్ల చెరువు మాయం కథనం అక్షర సత్యం

తాళ్ల చెరువు మాయం ... ఆనవాళ్లు లేకుండా పోయిన లెన్​నగర్​ లోని 30 ఎకరాల చెరువు అని 'దిశ' దిన పత్రికలో ప్రధాన శీర్షికన వచ్చిన కథనం అక్షర సత్యం అని మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొ

Update: 2024-09-13 16:30 GMT

దిశ, బడంగ్ పేట్​ : తాళ్ల చెరువు మాయం ... ఆనవాళ్లు లేకుండా పోయిన లెన్​నగర్​ లోని 30 ఎకరాల చెరువు అని 'దిశ' దిన పత్రికలో ప్రధాన శీర్షికన వచ్చిన కథనం అక్షర సత్యం అని మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ 36వ డివిజన్​ బీజేపీ కార్పొరేటర్​ ఎడ్ల మల్లేష్​ ముదిరాజ్​ అన్నారు. దిశ దిన పత్రికలో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని లెనిన్​నగర్ లోని 30 ఎకరాల​ తాళ్ల చెరువును కబ్జాకు పాల్పడింది తమది పేదల పార్టీ అని చెప్పుకునే నాయకులేనన్నారు. తాళ్ల చెరువులో కొద్ది కొద్దిగా మట్టిని నింపుతూ 30 ఎకరాలను కాజేసి వందల కోట్లు సంపాదించుకున్నారన్నారు.

    తమది పేదోళ్ల పార్టీ అని చెప్పుకుంటూ పేదలనే బలిపశువులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్ల చెరువు మాయం ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి న్యాయ విచారణ జరిపించాలన్నారు. చుక్క నీళ్లు లేకుండా తాళ్ల చెరువును మాయం చేసిన కబ్జాదారులపై క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే చెరువును మాయం చేసి అక్రమంగా సంపాదించుకున్న వందల కోట్లను వెంటనే రీకవరీ చేయాలన్నారు.  

Tags:    

Similar News