గ్రూప్-1 ప్రిలిమినరీకి 82.8 శాతం హాజరు

జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.

Update: 2022-10-16 10:18 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. ఆదివారం జిల్లాలో జరిగిన గ్రూప్-1 ప్రిలీమినరి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ నిఖిల పరిశీలించారు. సిద్దార్థ జూనియర్ కళాశాల, బృంగి ఇంటర్నేషనల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.

హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాలలో మొత్తం 4857 అభ్యర్థులకు గాను 4024 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 833 మంది గైహాజరు అయ్యారని, 82.8 శాతం హాజరు నమోదు అయినట్లు కలెక్టర్ తెలిపారు.

Tags:    

Similar News