RYTHU BANDHU ఇచ్చి సబ్సిడీలు ఎత్తేసిన ప్రభుత్వం
తెలంగాణాలో రైతుబంధు పథకం రైతులకు ఉపయోగపడుతున్నప్పటికీ, వారికి ప్రధానంగా ఉపోయోగపడే సబ్సిడీలు ఎత్తివేయడంతో రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు.
దిశ, ప్రతినిధి వికారాబాద్ : తెలంగాణాలో రైతుబంధు పథకం రైతులకు ఉపయోగపడుతున్నప్పటికీ, వారికి ప్రధానంగా ఉపోయోగపడే సబ్సిడీలు ఎత్తివేయడంతో రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. వర్షాలు పడక పంట నష్టం జరిగినా ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించపోగా.. రూ.1 లక్ష రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం కేవలం రూ.50 వేలు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకోవడంతో ఆత్మహత్యలు ఆగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుభీమా పథకం రైతులకు వందకు వందశాతం ఉపయోగపడుతున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం మాత్రం కేవలం ఓటు బ్యాంకు పెంచుకొని, రైతుకు రూ.10 ఇచ్చి రూ.100 లాక్కునే స్కీమ్ అనే ఆరోపణలు ఉన్నాయి.
రైతుబంధుతో లాభం కంటే నష్టం ఎక్కువ..!
రైతుబంధు పథకం ద్వారా వానాకాలంలో పంట పెట్టుబడి సహాయంగా ఎకరాకు రూ.5,000, యాసంగిలో రూ.5,000 చొప్పున తెలంగాణ ప్రభుత్వం రైతులకు నగదు సహాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 9 విడతలుగా రూ.2,320.57 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగింది. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ రైతుబంధు పథకం మొదలు పెట్టిన ప్రభుత్వం, ఆ రైతుకే తెలియకుండా అప్పటివరకు ఉన్న సబ్సిడీలు మొత్తం ఎత్తివేసింది. ఎకరాకు రూ.10 వేలు ఇస్తే చాలు సబ్సిడీలు అవసరం లేదు అనుకుందో ఏమో తెలియదు కానీ సబ్సిడీలు ఎత్తివేసింది.
దాంతో ఇప్పుడు సబ్సిడీలు లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతుబంధు రాగానే పంట పెట్టుబడికి ఖర్చు చేయాల్సిన డబ్బులను కాస్త కొందరు రైతులు అప్పులు కట్టువాడానికి ఉపయోగిస్తున్నారు. ఇక కొన్ని బ్యాంకుల మేనేజర్లు అయితే ప్రభుత్వం ఎంత చెప్పిన వినకుండా రైతుబంధు డబ్బులను అప్పుకిందకి కట్టుకుంటున్నారు. దాంతో రైతుల పరిస్థితి మొదటికి వచ్చింది. ఎప్పటిలాగే పంట పెట్టుబడికి అప్పుతీసుకోవడం, మందులు కూడా ఫర్టిలైజర్ షాపులలో ఉద్దెర తీసుకొని అప్పులపాలై చివరికి ఆత్మహత్యలు చేసుకువాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్షాలు విఫలం అయ్యాయా..?
రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా సబ్సిడీలు ఎత్తేసిన ఎందుకు చర్చ జరగడం లేదు..? అంటూ బిఎస్పీ, సిపీఎం లాంటి పార్టీల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.10 ఎరగా వేసి రూ.100 దోచుకుంటుంది అనే విషయాన్నీ రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రైతులకు అవగాహనా కల్పించడంలో విఫలం అయ్యాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధు వెనుక భారీ మోసం : బిఎస్పీ అసంబ్లీ ఇంచార్జి పెద్ది అంజి
రైతుబంధు వెనుక భారీ మోసం ఉందని బిఎస్పీ పార్టీ వికారాబాద్ అసంబ్లీ ఇంచార్జి పెద్ది అంజి అసహనం వ్యక్తం చేశారు. రైతుబంధు పేరుతో కెసిఆర్ ప్రభుత్వం, సామాన్య అమాయకపు రైతులను దోచుకునే పెద్ద కుంభకోణం మొదలు పెట్టిందని, ఈ మోసాన్ని ప్రజలు త్వరలోనే అర్ధం చేసుకుంటారని అన్నారు. రైతుబంధు మోసాన్ని ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రధాన ప్రతిపక్షనాలు పూర్తిగా విఫలం అయ్యాయి. ప్రభుత్వం బహిరంగంగానే సబ్సిడీలను దోచుకొని దాచుకుంటుంటే వీళ్ళు చూస్తూ అండడం తప్ప ప్రజల కోసం పోరాటం చేయాలనే ఆలోచనే వారికీ లేదు. బహుజనుల, రైతుల తలరాతలు మారాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో తెలంగాణాలో బిఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలని పెద్ది అంజి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read....