రాజీనామా పేరుతో పదవిపై కన్ను
జెడ్పీటీసీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండల్ జెడ్పీటీసీ ధారాసింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
దిశ, తాండూరు : జెడ్పీటీసీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండల్ జెడ్పీటీసీ ధారాసింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ధారాసింగ్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉంటూ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. ఏకైక నాయకుడిగా పెద్దేముల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ పేరును మారుమోగించారు. పార్టీ నుంచి పీసీసీ డెలిగేట్ పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ఆకస్మాత్తుగా ధారాసింగ్ ను ఎలాంటి సమాచారం లేకుండా పీసీసీ డెలిగేట్ పదవి నుంచి తప్పించారు. దింతో ధారాసింగ్ పార్టీ పైన అలక వహించినట్లు సన్నిహిత వర్గాలు నాయకులు ఆరోపించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీకి ధారాసింగ్ రాజీనామా పత్రాన్ని జిల్లా కమిటీకి అందజేసినట్లుగా తెలిసింది.
ఈ సందర్బంగా పీసీసీ డెలిగేట్ పదవి కోసమే డ్రామా చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పీసీసీ ఉపాధ్యక్షులు తాండూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రమేష్ మహారాజ్ కు సన్నిహితుడైన ధారాసింగ్ ను పార్టీలో నుంచి వెళ్ళానివారనే ఆలోచన పార్టీ నాయకులలో గట్టిగానే ఉంది. పదవిని దక్కించుకోవడం కోసమే, రాజీనామా అనే డ్రామాను చేస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ధారాసింగ్ రాజీనామా పత్రాన్ని నిరాకరించినట్లుగా సమాచారం. దీంతో పెద్దమ్మ జెడ్పీటీసీ ధారాసింగ్ కాంగ్రెస్ పార్టీను వీడే ప్రసక్తి లేదని స్పష్టమైనది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలతోనే పీసీసీ డెలిగేట్ పదవిని ధారాసింగ్ కు కాకుండా మరో వ్యక్తికి ఇచ్చారని పార్టీలోని పలువురు ప్రముఖులు ఆరోపిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీకి ధారాసింగ్ అందజేసిన రాజీనామా పత్రం నిజమేనా..? డ్రామానా....? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.