జీతాల కోసం ఆత్మహత్య ప్రయత్నం…పెట్రోల్ బాటిల్ తో నిరసన

జీతాల కోసం ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన ఘటన తాండూరు మున్సిపల్ లో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

Update: 2024-09-16 15:53 GMT

దిశ, తాండూరు : జీతాల కోసం ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన ఘటన తాండూరు మున్సిపల్ లో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల నుంచి ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ఇద్దరికీ జీతాలు ఇవ్వక అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీంతో విసిగిపోయిన పారిశుద్ధ్య కార్మికులు పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి అధికారుల ముందు ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పాలిటీలో చోటుచేసుకుంది వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో ఔట్సోర్సింగ్ కింద పారిశుద్ధ్య కార్మికులు తొమ్మిది మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 7 మందికి మున్సిపల్ ఖాతా నుంచి వరుసగా జీతం వస్తుండగా ఇద్దరికీ రాకపోవడంతో ఆ ఇద్దరు నర్సింలు, జ్యోతి ఈరోజు మున్సిపల్ కార్యాలయం లోకి వెళ్లి పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి నిరసనకు దిగారు.

మాకు ఎందుకు జీతాలు రావడం లేదు అంటూ అధికారులను ప్రశ్నించి భీష్మించి కూర్చున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కమిషనర్ ను పిలిపించడంతో కార్మికులు కమిషనర్ తో వాగ్వివాదానికి దిగారు. దీంతో కమిషనర్ గత కమిషనర్ మీ ఇద్దరి పేర్లను పొందుపరచలేరని ఇప్పుడు ఏమి చేసినా లాభం లేదని, ఈ విషయాన్ని ముందే కార్మికులకు చెప్పడం జరిగిందని అన్నారు. కానీ కార్మికులు మాత్రం మాతో ఉన్న ఏడు మందికి ఎలా జీతాలు వస్తున్నాయి మాకు మాత్రం రావడం లేదు అని ఇందులో అధికారుల ప్రమేయం ఎలా ఉందని ఆరోపించారు. దీంతో కమిషనర్ వారిని సంజాయించి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవాలని ఏదైనా ఉంటే కలెక్టర్ కు నివేదిక అందించి న్యాయం చేస్తామని కమిషనర్ విక్రమసింహారెడ్డి మీడియాతో పేర్కొన్నారు. గతంలో ఉన్న కమిషనర్ ఒక్కొక్క లేబర్ దగ్గర రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకు లంచాలు తీసుకొని చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Similar News