అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి.. రోడ్డెక్కిన విద్యార్థులు..

ఏఐఎస్ఎఫ్ షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆకాష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘం నాయకులు జిల్లా ఉన్నత స్థాయి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

Update: 2024-10-24 06:12 GMT

దిశ, షాద్ నగర్ : ఏఐఎస్ఎఫ్ షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆకాష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘం నాయకులు జిల్లా ఉన్నత స్థాయి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని చౌదర్ గూడ మండల కేంద్రంలో జిల్లా ఉన్నత స్థాయి పాఠశాలలో పనిచేస్తూ డిప్యూటేషన్ పై వెళ్లిన తెలుగు, ఇంగ్లీషు, ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలకు రప్పించాలని, వారి డిప్యూటేషన్ ను వెంటనే క్యాన్సల్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు తమకు ఇష్టం వచ్చినట్టు డిప్యూటేషన్ పై వెళితే విద్యార్థులు తమ చదువును నష్టపోతున్నారని, పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుందని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.


Similar News