ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు : రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్
ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు రాజేంద్రనగర్ సర్కిల్
దిశ,శంషాబాద్ : ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి డివిజన్ లక్ష్మిగూడ నుంచి బాంబే కాలనీ వరకు ప్రధాన రహదారిపై ఫుట్ ఫుట్‌పాత్‌లు ఆక్రమించి నిర్మించి వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీధర్ బృందం పోలీస్ బందోబస్తు మధ్య జెసీబీలతో ఫుట్‌పాత్‌ల పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పాఠశాలలకు ఇబ్బంది కలిగించేలా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. వ్యాపార సముదాయ దుకాణాలు వారికి ఉన్న సెటైల్ ఎవరికీ వ్యాపారం చేయాలి కానీ ముందు పళ్ల బండ్లు, చాయ్ దుకాణాలు, డబ్బాలు లాంటివి ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకొని షాపును సీజ్ చేయడం జరుగుతుందన్నారు.పుట్ పాత్ లు కేవలం రోడ్డు పక్కన నడవడానికి వాడుకోవాలి కానీ అక్కడ అక్రమ నిర్మాణం చేయడం నిషేధమన్నారు. ఇలా ఆక్రమించే నిర్మాణాలు చేయడం వల్ల బాటసారులు రోడ్డుపై నడవడంతో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి అన్నారు. అందువల్ల ఫుట్‌పాత్‌ల ను ఎవరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కూల్చివేతలు తప్పు అన్నారు. మరికొన్ని నిర్మాణాలకు కూడా రెండు రోజుల సమయం ఇచ్చామని ఆ రెండు రోజుల్లో వారంతట వారే కూల్చి వేసుకుంటే మంచిదని లేకుంటే మరోసారి కూల్చివేతలు తప్ప ఉన్నారు.కూల్చివేసిన స్థానంలో మరోసారి డబ్బాలు నిర్మాణం చేస్తే క్రిమినల్ కేసులను చేస్తామని హెచ్చరించారు.