అయ్యప్ప దీవెనలు తాండూరుపై ఉండాలి : పైలెట్ రోహిత్ రెడ్డి
అయ్యప్ప స్వామి దీవెనలు తాండూరు నియోజకవర్గ ప్రజలపై
దిశ, తాండూరు : అయ్యప్ప స్వామి దీవెనలు తాండూరు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోరారు.పైలెట్ రోహిత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో బుధవారం తాండూరులోని ఆయన స్వగృహంలో నిర్వహించిన ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అయ్యప్ప స్వామి మహా పడిపూజ కనుల పండుగగా నిర్వహించారు.అయ్యప్ప స్వాముల నృత్యా లు, భక్తుల ఆట పాటలు ఆకట్టుకున్నాయి. స్వాముల శరణు ఘోషతో తాండూరు భక్తి పారవశ్యంలో మునిగి పోయింది. తాండూరు నియోజకవర్గంలోని మాజీ ప్రజాప్రతినిధులు,నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో పడిపూజ లో పాల్గొని అయ్యప్ప స్వామి సేవలో తరించారు.అయ్యప్ప స్వామి సంకీర్తనలు భజనలు అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పల్లకి సేవ నిర్వహించారు.
అయ్యప్ప స్వాములు వందలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి భజనలు, సంకీర్తనలు, అయ్యప్ప స్వామి నామస్మరణతో తాండూరు పట్టణం మారుమోగింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి పల్లకి, భక్తిశ్రద్ధలతో ఆడుతూ పాడుతూ అయ్యప్ప నామ స్మరణ పఠిస్తూ కొనసాగించారు. ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… అయ్యప్ప మాల ధరించడం అంటే ఎన్నో జన్మ జన్మల పుణ్యఫలం అని అన్నారు. స్వామి వారి ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదన్నారు. ఇందూరులో ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో సకల దోషాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.