పోలీసులపై నమ్మకం కలిసేలా పనిచేయాలి : ఏసీపీ రంగస్వామి

ప్రజలు ఫిర్యాదు దారులతో పోలీసులపై నమ్మకం పెంపొందించే విధంగా

Update: 2024-12-18 14:31 GMT

దిశ, ఆమనగల్లు: ప్రజలు ఫిర్యాదు దారులతో పోలీసులపై నమ్మకం పెంపొందించే విధంగా విధులు నిర్వర్తించాలని షాద్ నగర్ ఏసిపి రంగస్వామి అన్నారు.బుధవారం ఆమనగల్లు సర్కిల్ ఆఫీస్ ను ఆయన తనిఖీ చేశారు.సీఐ ప్రమోద్ కుమార్, ఎస్ఐ వెంకటేష్,మరియు సిబ్బంది ఏసీపీ రంగా స్వామికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను తనిఖీ చేసీ, కేసు పురోగతులను సీఐ ప్రమోద్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.కేసు నమోదు వాటి స్థితిగతులు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై,త్వరితగతిన పరిశోధన పూర్తి చేయాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. సిబ్బంది ఆరోగ్య వివరాలు కనుక్కొని, విధి నిర్వహణతో పాటు ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్, ఏఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


Similar News