రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పాల్వాన్ కుమార్ హెచ్చరించారు.

Update: 2024-09-12 11:37 GMT

దిశ, మర్పల్లి :  ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పాల్వాన్ కుమార్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవల గురించి మెడికల్ ఆఫీసర్ ను, పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది రోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు.

     సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని, అన్ని రకాల జ్వరాలు డెంగ్యూ కావని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఫార్మసీ స్టోర్ లోని మందులను, ల్యాబ్​ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ రిజిస్టర్లను, వ్యాక్సిన్ నిల్వ ఉంచు ఐఎల్​ఆర్​, డీప్​ ఫ్రీజర్లను తనిఖీ చేశారు. వీటి నిర్వహణ పట్ల వైద్యాధికారి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రజలకు అంటువ్యాధుల గురించి వివరించాలని, గర్భవతులు అన్ని రకాల పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయించుకునేలా చూడాలని, సాధారణ ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రోత్సహించాలన్నారు. ఆయనతో పాటు డాక్టర్ రవీంద్ర యాదవ్, డాక్టర్ బుచ్చిబాబు ఉన్నారు. 

Tags:    

Similar News