బాలాపూర్ గణేష్ వద్ద ముగిసిన పూజలు.. ప్రారంభం అయిన గణేష్ శోభాయాత్ర

హైదరాబాద్‌లో కదిలే తొలి వినాయకుడు.. బాలాపూర్ గణపతి లడ్డు వేలం పాట మరి కొంత సేపట్లో ప్రారంభం కానుంది.

Update: 2024-09-17 03:19 GMT

దిశ, బడంగ్​పేట్: హైదరాబాద్‌లో కదిలే తొలి వినాయకుడు.. బాలాపూర్ గణపతి లడ్డు వేలం పాట మరి కొంత సేపట్లో ప్రారంభం కానుంది. 44 వసంతాల బాలాపూర్ గణేష్​ వార్షికోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాలు,2024 బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటలో 31వ సారి బాలాపూర్​ లడ్డు ఎవరికి సొంతం కానుందో.. మరో కొంత సేపట్లో భవితవ్యం తేలనుంది. బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట కోసం ఇప్పటికే కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్​గౌడ్, సాహెబ్​నగర్‌కు చెందిన సామ ప్రణీత్​రెడ్డి, (అర్బన్‌గ్రూప్), నాదర్​గూల్‌కు చెందిన గీతా డైరీ లక్ష్మీనారాయణ, బాలాపూర్‌కు చెందిన కొలను శంకర్​రెడ్డి, పోచారం‌కు చెందిన (ఎన్‌వై ఆర్) ఫౌండేషన్‌లు, సామ కార్తీక్ రెడ్డి, వర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలు ఐదు వేలు చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు. అంతే కాకుండా గత సంవత్సరం 2023 లో జరిగిన వేలం పాట మొత్తాన్ని రూ. 27 లక్షల రూపాయలను ఇప్పటి కే డిపాజిట్ చేశారు. రూ.1016 తో వేలం పాట సాగనుంది. గత ఏడాది 2023 లో రూ.27 లక్షలకు దాసరి దయానంద్​రెడ్డి సొంతం చేసుకున్నారు. కాగా ఈ యేడు కాసేపట్లో జరుగనున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఎంతో ఆసక్తి రేకెత్తించనుంది. బాలాపూర్ పురవీధుల గుండా కాసేపట్లో ప్రారంభం కానున్న గణేష్ శోభాయాత్ర అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలం పాట ప్రారంభం కానుంది.


Similar News