మహిళల అభివృద్దితోనే రాజ్యాధికారం సాధ్యం.. మంత్రి సీతక్క..

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి జరిగుతుందని పంచాయతీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Update: 2025-01-04 09:48 GMT

దిశ, షాద్ నగర్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి జరిగుతుందని పంచాయతీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని మధులపూర్ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు మంత్రి సీతక్కకు బోనాలతో స్వాగతం పలికారు. మొదటగా మదులపూర్ గ్రామం నుండి కమ్మదనం గ్రామం వరకు 7 కోట్ల రూపాయలతో బీటి రోడ్డు, కమ్యూనిటీ భవనం 15 లక్షలు, 35 లక్షలతో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ మధులపూర్ గ్రామం ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఇచ్చిందని అన్నారు. షాద్ నగర్ నియోజక అభివృద్ధి కోసం అహర్నిశలు ఎమ్మెల్యే శంకర్ కష్టపడతారని, పైసా కూడా వడ్డీ లేకుండా 50 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. మహిళలు బాగుంటేనే రాజ్యం బాగుతుందని, గత ప్రభుత్వం ఎవరికి ఏమి చేయలేదు. పేదింటి మహిళలు ఉచిత బసు ఎక్కితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వడం లేదని అన్నారు.

గతంలో సోనియా నాయకత్వంలో 500 వందల కే సిలిండర్ ఇచ్చిందని, ఇప్పుడు అదే మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి 500 వందలకే సిలిండర్ ఇస్తూ మిగితా డబ్బులు అకౌంట్ లో జమ చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం 15 రకాల ఉపాధి పనులను మహిళలకు గుర్తించామని అన్నారు. వాటితో మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 32 జిల్లాలో చేపలు పట్టుకొని జీవనం సాగించే మహిళలకు 6 లక్షలు మాఫీ చేస్తూ 4 లక్షలు కట్టుకునే విధంగా ప్రోత్సాహకం అందించామని అన్నారు. మహిళలు సక్రమంగా ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని లక్షదికారి కావాలని, సావిత్రిబాయి పూలే లాగా ఇంటి నుండి బయటికి వచ్చి ఆడవాళ్ళకు స్కూల్ పెట్టి మహిళలకు అక్షరాస్యత నేర్పించిందని, కానీ గత సావిత్రి బాయి పూలే జయంతిని నిర్వహించలేదని కానీ నేడు ప్రజా ప్రభుత్వంలో సావిత్రి బాయి పులే జయంతి అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లు శ్యామ్ సుందర్ రెడ్డి, తాండ్ర విశాల, వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, బాలరాజు గౌడ్, మార్కెట్ ఛైర్మెన్ సులోచన కృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మహమ్మద్ ఇబ్రహీం, జామృత్ ఖాన్ తదితరులున్నారు.


Similar News