కలెక్టర్​ ఆదేశించినా పరిగిని వీడని అంధకారం

‘అంధకారంలో పరిగి’ అనే శీర్షిక దిశ దిన పత్రికలోఈనెల 18వ తేదీన ప్రచురితమైన కథనానికి.... Special Story of Parigi

Update: 2023-03-25 10:58 GMT

దిశ, పరిగి: ‘అంధకారంలో పరిగి’ అనే శీర్షిక దిశ దిన పత్రికలోఈనెల 18వ తేదీన ప్రచురితమైన కథనానికి జిల్లా అధనపు కలెక్టర్​రాహుల్​శర్మ స్పంధించి ఆదేశాలు జారీ చేసినా సమస్యలు తీరలేదని చెప్పుకోవచ్చు. పరిగిలో హైవే రోడ్డు పొడుగునా వీధిలైట్లు లేక పాదచారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమావాస్య చీకటైనా నాలుగైదు రోజుల్లో వీడుతుంది. కానీ, అధికారులు, పాలకుల నిర్లక్ష్యపు చీకటి ఇంకా వీడటం లేదని పరిగి మున్సిపల్​ప్రజలు మండిపడుతున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలో హైవే రోడ్డు పొడుగునా వీధిలైట్లకు మీటర్ కనెక్షన్​తీసుకోకుండా వాడుకుంటున్నారంటూ డిస్కం ఏఈ ఖాజా బాబు విద్యుత్​సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఈ విషమయై ఈనెల 22వ తేదీన అధనపు కలెక్టర్​రాహుల్​శర్మ చాంబర్​లో మున్సిపాలిటీ కమిషనర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. పరిగిలో హైవే రోడ్డుపై వీధిలైట్లు సాయంత్రంలోగా వెలిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. అదనపు కలెక్టర్​ఆదేశించి నాలుగు రోజులైనా పరిగిలో అంధకారం వీడలేదు. ఈ విషయమై పరిగి మున్సిపల్​ కమిషనర్​ శ్రీనివాస్​ ను వివరణ కోరగా హైవే వారు మున్సిపాలిటీకి వీధిలైట్ల నిర్వహన అప్పగించలేదని ఈ విషయమై స్థానికపాలకులు, హైవే కాంట్రాక్టర్​ వీధిలైట్లు వెలిగేలా చూడాలని చెప్పామన్నారు. నెల రోజులుగా పరిగిలో హైవే పొడుగునా అంధకారం నెలకొని పాదచారులు రోడ్డుపై నడుస్తూ, రోడ్డు క్రాస్ చేసేట్టప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని భయభయంగా నడుస్తున్నారు. హైవే పొడుగునా అంధకారం నెలకొన్నా పాలకులకు కనువిప్పు కలుగకపోవడంమన దురదృష్టమేనని ప్రజలు అనుకుంటున్నారు.

Tags:    

Similar News