ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే మహేశ్​ రెడ్డి

పరిగి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఉచిత డయాలసిస్​ కేంద్రాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు.

Update: 2023-05-25 14:10 GMT

దిశ, పరిగి: పరిగి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఉచిత డయాలసిస్​ కేంద్రాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. పరిగి మున్సిపల్​ పరిధి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఉచిత డయాలసిస్​ సెంటర్ ను ప్రారంభించామని చెప్పారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్​ సెంటర్ లో అసరమున్న వారు ఉచితంగా సేవలు పొందవచ్చన్నారు.

ఒక రోజులో సుమారు 15 నుంచి 21 మంది రోగులకు ఈ రక్త శుద్ది చేసేందుకు వీలుగా మిషనరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కొంత కాలంగా డయాలసిస్​ పేషెంట్లు వికారాబాద్​, తాండూరు, హైదరాబాద్​ ప్రాంతాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇక నుంచి పరిగిలోనే ఈ ఉచిత వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల ఆరోగ్యమే ప్రథమ థ్యేయంగా పనిచేస్తుందన్నారు. డయాలసిస్​ పేషంట్లకు భరోసా కల్పిస్తూ పింఛన్లు కూడా అందజేస్తుందని చెప్పారు. కార్పొరేట్​  ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని తెలిపారు.

అనంతరం ఆస్పత్రికి వచ్చే ప్రతి వారికి స్వచ్చమైన తాగునీరు అందించేందుకు తాగునీటి శుద్ది ప్లాంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్​ చైర్మన్​ ముకుంద అశోక్​ కుమార్​, ఎంపీపీ కరణం అరవింద్​ రావు, జడ్పీటీసీ బేతు హరిప్రియ, డాక్టర్లు ప్రదీప్​, ఆస్పత్రి సూపరిటెండెంట్ షాజియా,పీఏసీఎస్​ వైస్​ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్​, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, మునీర్​, నాగేశ్వర్​, వేముల కిరణ్​ కుమార్​ గుప్తా, వారాల రవీంద్రా, మౌలానా, అన్వర్​ సేట్​, పరిగి మాజీ ఉప సర్పంచ్​ బషీర్​ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News