సోనియా గాంధీ మాటే మాకు శిలా శాసనం.. మాట ఇస్తే తప్పదు : రేవంత్ రెడ్డి

షాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బి జె పి,బి ఆర్ ఎస్ పార్టీలకు ఒక్క ఎంపీ సీటు కూడా రానివ్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2024-02-27 16:34 GMT

దిశ, షాబాద్ : షాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బి జె పి,బి ఆర్ ఎస్ పార్టీలకు ఒక్క ఎంపీ సీటు కూడా రానివ్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి రాష్ట్రానికి, నిరుద్యోగ యువతకు చేసిందేమీ లేదని,వారు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కుటుంబ సభ్యులకు మత్రం అందరికీ పదవులు కటబెట్టడని మండి పడ్డారు.వారు అన్ని లిక్కర్ మాఫియా, ప్రాజెక్టు ల స్కాములు చేశారన్నారు. త్వరలోనే మెగా డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చారు.

సోనియా గాంధీ తుక్కుగుడ లో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు ఇప్పటికే రెండు అమలు చేశామని గురువారం నుండి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,₹ 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు అవుతాయని తెలిపారు. సోనియా గాంధీ మాట తమకు శాసనమని,ఆమె మాట ఇస్తే ఖచ్చితంగా అమలవుతుంది అన్నారు.ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రాన తన బాధ్యత తిరిపోలేదని ప్రతి కార్యకర్త ఉన్నత స్థాయికి ఎదిగినపుడే తన బాధ్యత తీరుతుందని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో పర్యటిస్తానని వచ్చే అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని కోరాడు.

చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ది తన బాధ్యత అని అన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు దేశంలోనే అత్యంత అరుదైన పథకా లని,18 కోట్ల మంది మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నరని తెలిపారు .బి ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని అక్రమాలకు పాల్పడిందని 10 వేల కోట్ల మిగులు ఆదాయంతో తెలంగాణా రాష్ట్రం ఇస్తే 7లక్షల కోట్ల అప్పు చుపించిదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను ఆపింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని, కాళేశ్వరం, మెడిగడ్డ ప్రాజెక్ట్ లు అన్ని నాణ్యత లేని కట్టడాలనీ, వాటి ద్వారా రైతులు లబ్ది పొందలేదని అన్నారు.

మహిళలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1తేదీన జీతలిస్తున్నమన్నారు. బిజెపి నేతలు ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తోందని ఇది చాలా తప్పని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు సీతక్క, శ్రీధర్ బాబు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ రెడ్డి,రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ,చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జి పామెన భీం భరత్, జెడ్ పి ఛైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, వికారాబాద్ జెడ్ పి చైర్పర్సన్ సునిత మహేందర్ రెడ్డి, ఎలగంటి మధు సుదన్ రెడ్డి, చల్లా నరసింహ రెడ్డి,కావలి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు...


Similar News