ధాన్యంలో కోత విధిస్తే సమాచారం ఇవ్వండి : ఎమ్మెల్యే కసిరెడ్డి
కల్వకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యంలో కోత విధిస్తే సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు సూచించారు.
దిశ, ఆమనగల్లు ::- కల్వకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యంలో కోత విధిస్తే సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు సూచించారు. సోమవారం ఆమనగల్లు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిసిసిబి డైరెక్టర్,ఆమనగల్లు సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ధాన్యం తూకం వేసిన మూడు రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని, దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ మాట్లాడుతూ… రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు ఏఎంసీ చైర్ పర్సన్ యాట గీత,వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు జోగు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు వస్పూల శ్రీశైలం, మండల వ్యవసాయ అధికారి శ్రీలత, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బిచ్య నాయక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.