అరికెపూడి గాంధీకి పలువురు ఎమ్మెల్యేల పరామర్శ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల పంచాయితీ నార్సింగి పోలీస్​స్టేష‌న్‌ను చేరింది.

Update: 2024-09-12 15:44 GMT

దిశ‌, గండిపేట్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల పంచాయితీ నార్సింగి పోలీస్​స్టేష‌న్‌ను చేరింది. ఇరువురి మ‌ధ్య వివాదం రాజుకోవ‌డంతో పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ వెళ్లే ప‌రిస్థితులు దారి తీశాయి. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికపూడి గాంధీ, అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

    ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉంచడంతో ఆయనను పరామర్శించడానికి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిలు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు అందరూ అరికెపూడి గాంధీకి మద్దతుగా నిలవడంతో అందరి చూపు ఆ ఎమ్మెల్యేలపైనే ఉంది. వీరిపైన అర్హత వేటు వేయాలని కోర్టు ఆదేశాలు ఉండడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆస‌క్తిగా చర్చించుకుంటున్నారు. అరికెపూడి గాంధీని అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News