ఇందిరమ్మ కమిటీలతో పథకాలు

ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేసేందుకు త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-10-12 12:54 GMT

దిశ, తాండూరు :ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేసేందుకు త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, తాండూరు, పెద్దేముల్,బషీరాబాద్ మండలాల నాయకులతో డివిజన్‌స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ఇందిరమ్మ కమిటీలపై నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇందిరమ్మ కమిటీలతోనే ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పారు. కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదగాలని, పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను ఉన్నతస్థితికి తీసుకువస్తామని తెలిపారు.వార్డులలో, గ్రామాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ.. కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అమలులో ఇందిరమ్మ కమిటీ సభ్యులే కీలకమన్నారు. మహిళ సంఘాలకు, యువకులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిసిసిబీ వైస్ చైర్మన్ రవి గౌడ్, అజయ్ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, అధికారులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News