అమ్మ ఆదర్శ స్కూల్స్​లో స్కావెంజర్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితి గత పదేండ్ల అధ్వానంగా ఉండేది. స్కూల్స్ పరిసరా ప్రాంతాలు పరిశ్రుభంగా లేకపోవడంతో విద్యార్థుల అస్వస్థకు,

Update: 2024-10-22 16:10 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితి గత పదేండ్ల అధ్వానంగా ఉండేది. స్కూల్స్ పరిసరా ప్రాంతాలు పరిశ్రుభంగా లేకపోవడంతో విద్యార్థుల అస్వస్థకు, అనారోగ్యానికి గురైన సంఘటనలు అనేకమున్నాయి. అంతేకాకుండా విద్యార్థులకు చదువు చెప్పే టీచర్లే స్కూల్ ని శుభ్రం చేసుకోవాలని అప్పటి ప్రభుత్వం సూచించడం శోఛనీయం. ప్రభుత్వ నిర్ణయాన్ని టీచర్లు వ్యతిరేకించడంతో పంచాయతీ పరిధిలోని సఫాయి కార్మికుల చేత పరిశుభ్రం చేసుకోవాలని మరో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడంలో అప్పటి ప్రజాప్రతినిధులకు తలప్రాణం తోకకు వచ్చేదనే చందంగా ఉండేది.

ఒక్క సఫాయి కార్మికుడు సైతం పాఠశాలలను శుభ్రం చేసేందుకు ససేమేరా అనేవాళ్లు. కొంత మంది టీచర్లు సొంత నగదుతో స్కావెంచర్లు పెట్టుకుని శుభ్రం చేసుకున్న రోజులు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ప్రస్తుత​ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పు తీసుకరావాలనే ఉద్దేశ్యంతో ఖాళీగా ఉన్న టీచర్లను భర్తీ చేయడంతో పాటు అవసరమైన మౌళిక సదుపాయాలు, స్కావెంజర్ల నియామకం వైపు దృష్టి సారించింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్​ ఉద్యోగాలను భర్తీ చేసింది. విద్యార్థులు దుమ్ము దూళీతో ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతో స్కావెంజర్లను నియమించింది. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మొదటగా మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ స్కూల్స్​ పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని అర్థమవుతుంది.

స్కావెంజర్లతో సమస్యలకు చెక్​...

ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రత, పచ్చదనం ఉండేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక నిధులు కేటాయించి పాఠశాలలను పరిశ్రుభం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కావెంజర్లను నియామకం చేసింది. ఇన్నేండ్లుగా స్కావెంజర్లు లేకపోవడంతో టీచర్లు, విద్యార్థులు వాష్​రూమ్​లు, టాయిలెట్లు అస్తవ్యస్తంగా ఉండి కంపు కొట్టే పరిస్థితి ఉండేది. దీంతో విద్యార్ధులను స్కూల్స్​కు పంపించేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్కావెంజర్లను ఏర్పాటు చేసి స్కూల్స్​కు మంచిరోజులు వచ్చాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాలతో పాటు విద్యుత్​ సరఫరా కూడా ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క సమస్యను క్రమ క్రమంగా పరిష్కారించుకుంటూ ప్రభుత్వం వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 1319 స్కూల్స్​ ఉంటే 1225 స్కూల్స్​కు మాత్రమే 1231 మంది స్కావెంజర్లను నియమించింది. మిగిలిన 93 స్కూల్స్​లో పిల్లల సంఖ్య జీరో కావడంతో నియామకం లేదు. వికారాబాద్​ జిల్లాలో 1071 స్కూల్స్​ ఉంటే 1007 స్కూల్స్​లో 1041 మంది స్కావెంజర్లను ఏర్పాటు చేసుకోగా మిగిలిన 64 స్కూల్స్​లో జీరో సంఖ్యలో విద్యార్థులు ఉండటంతో నియామకం చేపట్టలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్కూల్లో ఉండే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇచ్చే వేతనాల వివరాలు విడుదల చేశారు. అయితే మూడు నెలలకు కలిపి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం పనిచేసే 1231 మంది స్కావెంజర్లకు రూ.2,32,02,000... వికారాబాద్​ జిల్లాలో 1041 మంది స్కావెంజర్లకు రూ.1,68,93,000 నిధులను విడుదల చేశారు.

ఇదే పద్ధతిలో...

విద్యార్థుల సంఖ్య... చెల్లించే వేతనం (రూ..)

1 నుంచి 30 వరకు 3వేలు

31 నుంచి 100 వరకు 6వేలు

101 నుంచి 250 వరకు 8వేలు

251 నుంచి 500 వరకు 12వేలు

501 నుంచి 750 వరకు 15వేలు

750 పైన ఉంటే 20వేలు

స్కావెంజర్లతో స్కూల్స్​ పరిశుభ్రం... –సుశీందర్​ రావు, జిల్లా విద్యాశాఖాధికారి రంగారెడ్డి జిల్లా


పాఠశాలల్లో స్కావెంజర్లను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారానే నియమించుకున్నారు. నియామకాలను మాత్రం స్థానికంగా ఉండే మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం అప్పగించింది. అయితే నియామకమైన స్కావెంజర్లకు ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారమే గౌరవ వేతనాలు చెల్లిస్తాము. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా నిధులు మంజూరు అయ్యాయి. అదే పద్దతిలో స్కావెంజర్లకు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతీ మూడు నెలలకోసారి వేతన రూపంలో అందించాల్సి ఉంటుంది. మూత్రశాలలు, మరుగుదొడ్లు, పరిసరాలు శుభ్రం చేసేందుకు అవసరమయ్యే చీపురు కట్టలు, మొదలైనవి స్కూల్‌ గ్రాంట్స్‌ ద్వారా తెప్పించాలి.


Similar News