ఆ మిల్లు మాకొద్దు

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధి రాంపూర్ గ్రామ పాఠశాల ఆవరణ పక్కన నిర్మించతలపెట్టిన మిల్లును నివారించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈవోలకు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వినతి పత్రం అందజేశారు.

Update: 2022-10-10 12:25 GMT

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధి రాంపూర్ గ్రామ పాఠశాల ఆవరణ పక్కన నిర్మించతలపెట్టిన మిల్లును నివారించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈవోలకు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాల పక్కన బుడ్డపలుకు పరిశ్రమ ఏర్పాటు చేస్తే విద్యార్థుల చదువుకు తీవ్ర ఆటంకం కలుగుతుందని, వారి నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు దుమ్ముధూళి ధ్వని కాలుష్యం పర్యావరణ కాలుష్యం వలన విద్యార్థులు అనేక రోగాల బారిన పడి చదువుకు దూరమవుతారని వినతి పత్రంలో పేర్కొన్నారు.

2007 సంవత్సరంలో రాంపూర్ పాఠశాలకు మిద్దెల హరి మోహన్ రెడ్డి 20గుంటల స్థలాన్ని ఇస్తానని తీర్మానం చేసి, పాఠశాల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదని, వెంటనే ఆ స్థలాన్ని పాఠశాల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల జీవితాలతో ఆటలాడే పరిశ్రమలను నెలకొల్పితే తిరుగుబాటు తప్పదని సూచించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్, నాయకులు మహేష్, నరసింహ, సాయితేజ, వెంకటేష్, రాము, శ్రీకాంత్, బాలకృష్ణ, శివ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News