అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్తు హెచ్చరించారు.

Update: 2024-09-26 11:23 GMT

దిశ, శంషాబాద్ : ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్తు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన సయ్యద్ గూడ సర్వేనెంబర్ 24లోని ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు రావడంతో గురువారం శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్తు నేరుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కృష్ణ, సారికలతో కలిసి జేసీబీలతో వాటిని నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీలింగ్ భూములు, చెరువులు, కుంటలు, నాళాలలో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలిస్తే నేరుగా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరారు.  

Tags:    

Similar News