Disha Effect: యాచారం కందుకూరు రోడ్డుకు మరమ్మత్తులు

గత 15 ఏండ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టక నామమాత్రము మరమ్మత్తులు చేస్తూ అలాగే వదిలేశారు. దీంతో దారిపై పెద్ద పెద్ద గుంతలు పడి కంకర తేలిన యాచారం కందుకూరు రోడ్డు అధ్వానంగా మారింది.

Update: 2024-07-27 08:03 GMT

దిశ, యాచారం: గత 15 ఏండ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టక నామమాత్రము మరమ్మత్తులు చేస్తూ అలాగే వదిలేశారు. దీంతో దారిపై పెద్ద పెద్ద గుంతలు పడి కంకర తేలిన యాచారం కందుకూరు రోడ్డు అధ్వానంగా మారింది. దీనికి తోడు వరుసగా కురుస్తున్న వర్షాలతో గుంతలలో వర్షపు నీరు చేరి బురద మయంగా మారి వాహన చోదకులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నారని మరమ్మత్తులు చేయాలని, స్థానికులు ఫిర్యాదులు చేసిన ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో దిశ దినపత్రికలో ఇది చెరువు కాదు రోడ్డు, అడుగుకో గుంత అనే అనే శీర్షికలతో.. వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. దీంతో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారుల స్పందించి ఎట్టకేలకు శనివారం జెసీబీతో రోడ్డు మరమ్మతులు చేపట్టగా.. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News