సీఐగా బాధ్యతలు స్వీకరించిన A. నరసింహారావు
మండల సీఐ గా A. నరసింహారావు, శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సీఐ శంకర్ కుమార్, మహేశ్వరం ట్రాఫిక్ సీఐగా బదిలీ కావడంతో ఆ స్థానంలో ఏ నరసింహారావు, ను నియమించారు.
దిశ, యాచారం: మండల సీఐ గా A. నరసింహారావు, శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సీఐ శంకర్ కుమార్, మహేశ్వరం ట్రాఫిక్ సీఐగా బదిలీ కావడంతో ఆ స్థానంలో ఏ నరసింహారావు, ను నియమించారు. ఈ సందర్భంగా యాచారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. గుట్కా, పేకాట, గంజాయి పై, ఉక్కు పాదం మోపనున్నట్లు తెలిపారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు.