విచారణ అనంతరం విడుదల
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి పై దాడికి పాల్పడిన లగచర్ల, రోటి బండ తండా, ఫుల్ చర్ల కుంట, హకీంపేట్, పాలేపల్లి తదితర గ్రామాలకు చెందిన 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి పై దాడికి పాల్పడిన లగచర్ల, రోటి బండ తండా, ఫుల్ చర్ల కుంట, హకీంపేట్, పాలేపల్లి తదితర గ్రామాలకు చెందిన 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిని కలెక్టర్ పై దాడికి సంబంధించిన వీడియోలు చూపించి దాడికి కారకులైన వారిని, దాడికి ప్రేరేపించిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విచారణ కొనసాగించారు. అనంతరం అనుమానితులుగా ఉన్న కొంతమందిని అదుపులో ఉంచుకొని మిగతా వారిని పరిగి పోలీస్ స్టేషన్ నుంచి పంపించేశారు.