అక్రమార్కులకు వరంగా రియల్ వ్యాపారం?

రియల్​ వ్యాపారం అక్రమార్కులకు వరంగా మారింది. సాధరణ పౌరుడిని నిబంధనల పేరుతో చుక్కులు చూపుతున్న అధికారులు అక్రమార్కులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారనడంలో

Update: 2023-04-19 02:42 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో/ చేవెళ్ల: రియల్​ వ్యాపారం అక్రమార్కులకు వరంగా మారింది. సాధరణ పౌరుడిని నిబంధనల పేరుతో చుక్కులు చూపుతున్న అధికారులు అక్రమార్కులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారనడంలో సందేహం లేదు. జిల్లాలో పనిచేసే అధికారులు ఎవరికి వారే బాస్​లుగా చెప్పుకుంటూ పనిచేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు చేసే తప్పిదాలపై నిఘా ఎందుకు పెట్టడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు ఎవరూ ఎలాంటి పనిచేసినా వాటాల రూపంలో పంచుకుంటూ పనులు చక్కబెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. క్షేత్ర స్థాయిలోకి ప్రజాప్రతినిధులు సమస్యలపై, అధికారులు చేసే అక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. కానీ తమకు నచ్చినట్లు వ్యవహరించే అధికారి, ఉద్యోగిపై చిందులు వేస్తారు. అదే అధికారి ఆ ప్రజాప్రతినిధికి రాచమార్యాదలు చేస్తే తప్పులు కనిపించవనే ప్రచారం లేకపోలేదు. ఇదే తంతు చేవెళ్ల మండలంలో రెవెన్యూ, పంచాయతీ పరిధిలో కొనసాగుతున్నది. దీంతో ప్రభుత్వ ఆదాయానికే భారీ గండి పడుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు..

చేవెళ్ల మండలం, ఆలూర్​లో సర్వే నెంబర్​ 235, 232లో సుమారు 17 ఎకరాల్లో హైదరాబాద్​‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్లు, డ్రైనేజీ, కరెంట్​ స్తంభాలు వేసి దర్జాగా ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నాడు. సదరు వ్యాపారి ఈ సర్వే నెంబర్ భూమిని వ్యవసాయం నుంచి నాలాకు బదిలీ చేయకుండానే వ్యాపారం మొదలు పెట్టాడు. పంచాయతీ కార్యదర్శికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెల రోజులుగా చదును చేస్తూ రోడ్లు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే భూమిని గుంటలల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.. ప్లాట్లు చేయడం లేదు.. అని దాబాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తహశీల్దార్ తో పాటు స్థానిక నాయకుల అండదండలున్నట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులతో అధికారులు కుమ్మక్కై ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అధికారుల, ఉద్యోగుల జేబుల్లోకి వెళ్తుందని తెలుస్తోంది.

ఏ పద్ధతిలో విక్రయాలు..?

అమాయక రైతులను మొసం చేస్తూ రియల్​ వ్యాపారులు తక్కువ ధరకు భూమి కొనుగోలు చేస్తున్నారు. ఆ వ్యాపారి అధికారులతో కుమ్మక్కై అదే భూమిని రైతు కన్నుల ముందే అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. సదరు రైతు అమ్మిన భూమిలో నిబంధనల ప్రకారం నాలా కన్వర్షన్​ పెట్టుకోవాలి. ఆ తర్వాత వెంచర్​ డెవలప్​ చేయాలి. అవేవీ పట్టించుకోకుండా కేవలం రోడ్లు వేసి విక్రయాలు చేపట్టడంతో అటు వినియోగదారులు, ఇటు రైతులను మోసం చేస్తున్నారు. అధికారులు కండ్లుమూసుకోని పనిచేస్తున్నారు. ఫిర్యాదులు చేస్తే అధికారులు భూ అక్రమనిర్మాణదారులతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకోవడం అలవాటుగా మారింది.

Tags:    

Similar News