భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును సూచిస్తుంది : సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క
రాహుల్ గాంధీ చేసే భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును సూచిస్తుందని సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్కఅన్నారు.
దిశ, షాద్ నగర్ : రాహుల్ గాంధీ చేసే భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును సూచిస్తుందని సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్కఅన్నారు. శుక్రవారం షాద్ నగర్ నియోజక వర్గం అన్నారం వై జంక్షన్ వద్ద ఏర్పాట్లపై నాయకులలో చర్చించారు. ఈ సందర్బంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి సారిగా కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు పాదయాత్ర రాహుల్ గాంధీ చేస్తున్నారని, దేశాన్ని మతతత్వ శక్తుల చేతులలో విడిపోకుండా ఉండడం కోసం ఆర్ధిక పరమైన వ్యత్యాసాలతో విడిపోయి అరాచకాలు సృష్టించకుండ ఉండడం కోసం పాదయాత్ర చేస్తూ మన మధ్యకు వస్తున్న రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం, రాహూల్ గాంధీ చేసే భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును, దేశక్షేమాన్ని కాంక్షిస్తుంది కాబట్టి దేశం మీద ప్రేమవున్న ప్రతీ ఒక్కరు పాల్గొనాలని, ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.
రాహుల్ గాంధీ పాదయాత్ర కోసం షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలు ఆయన నడకలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశ భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ మద్దతుగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరారు. ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా రాహుల్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ పట్టణ అధ్యక్షులు కొంకల్ల చెన్నయ్య, ఫరూఖ్ నగర్ మండల అద్యక్షులు ఆశన్న గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బాల్ రాజ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, అందే మోహన్, జితేందర్ రెడ్డి, రఘు, సీతయ్య, అశోక్, ఖదీర్, రాయికల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.