రైతు పొలంలో కొండచిలువ ప్రత్యక్షం..
మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో పెద్ద చెరువు సమీపంలోని గోపిరెడ్డి కిషన్ రెడ్డి, వ్యవసాయ పొలంలో సోమవారం 15 ఫీట్ల కొండచిలువ ప్రత్యక్షమైంది.
దిశ, యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో పెద్ద చెరువు సమీపంలోని గోపిరెడ్డి కిషన్ రెడ్డి, వ్యవసాయ పొలంలో సోమవారం 15 ఫీట్ల కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండచిలువ కనపడటంతో రైతులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అనంతరం రైతులు చాకచక్యంగా వ్యవహరించి కొండ చిలువను కట్టెల సహాయంతో అటవీ ప్రాంతంలో వదిలి వేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.