లక్ష్యం ముందు పేదరికం చిన్నబోయింది

పేదరికం చదువుకు అడ్డుకాదని, ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు సాధించాలన్న లక్ష్యం ముందు ఆ అమ్మాయి పేదరికం చిన్నబోయింది.

Update: 2024-10-15 16:19 GMT

దిశ,షాద్ నగర్ : పేదరికం చదువుకు అడ్డుకాదని, ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు సాధించాలన్న లక్ష్యం ముందు ఆ అమ్మాయి పేదరికం చిన్నబోయింది. షాద్ నగర్ పట్టణానికి చెందిన భైరమోని మేఘన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్ది. తండ్రి బైరమోని రమేష్, తల్లి మంజులలు టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో మేఘన మంచి ర్యాంక్ సాధించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ బచ్చలి నరసింహులు విద్యార్థి మేఘనను మాజీ మంత్రి కేటీఆర్ కు పరిచయం చేశారు. టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న భైరమోని రమేష్, మంజుల కూతురైన మేఘన ఎంబిబిఎస్ సీటు సాధించడం ఎంతో గొప్ప విషయమని కేటీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు. ఎన్నారై శ్రీనివాస్ 40 వేల రూపాయలను నగదు ప్రోత్సాహకం గా అందజేశారు. ఎన్నారై శ్రీనివాస్ తల్లి పొట్టి అమృతమ్మ నగదును కేటీఆర్ చేతుల మీదుగా మేఘనకు అందజేసింది.


Similar News