ముగిసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లిని విచారణ చేశారు.

Update: 2025-03-14 13:04 GMT
ముగిసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణ
  • whatsapp icon

దిశ ,మొయినాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లిని విచారణ చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన తోల్ కట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 64 మందిని అదుపులోకి తీసుకుంది. ఫామ్ హౌస్ లో కోళ్ళ పందాలు ఆడుతున్న వారితో పాటు.. 64 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, ఫామ్ హౌస్ ను తాను లీజుకి ఇచ్చానని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. లీజు డాక్యుమెంటన్లను సైతం ఇప్పటికే పోలీసులకు అందజేశారు. కాగా, లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో.. విచారణకు హాజరుకావాలంటూ మరోసాని గురువారం నాడు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మొయినాబాద్ పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు అయ్యేందుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. అయితే.ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్ లోని మూడు నాలుగు సెక్షన్లతో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫాంహౌస్ లో తనిఖీలు చేసిన సమయంలో 46 కోడి కత్తులతో పాటు బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గురువారం విచారణకు హాజరుకావాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దాంతో శుక్రవారం ఉదయం 11:30 గంటలకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎమ్మెల్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణ హాజరయ్యారు. నాలుగున్నర గంటలకు కొనసాగిన ఈ విచారణ తోల్కట్ట గ్రామ రెవెన్యూ లో ఉన్న తన సొంత భూమిలో ఉన్న ఫామ్ హౌస్ తన అల్లుడు ఫామ్ హౌస్ యొక్క వ్యవహారాలు చూసుకునేవాడని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తన అల్లుడు రమేష్ రెడ్డి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడని దీనికి సంబంధించిన అన్ని పేపర్స్ పోలీస్ వారికి ఇవ్వడం జరిగిందన్నారు. వారిపై కేసులు కూడా పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు.

పోలీస్ విచారణ లీజుకు సంబంధించిన విషయాలను అడిగారని ఆయన స్పష్టం చేశారు. సంబంధించిన వివరాలన్ని పోలీసు వారికి ఇవ్వడం జరిగిందని,లీజుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పోలీసులకు అందజేయడం జరిగిందని విచారణలో ఆయన తెలిపినట్లు చెప్పారు. ప్రతి నెల మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గ్రామ రెవెన్యూ లో ఉన్న ఫార్మ్ హౌస్ లో ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారని, మీడియా మిత్రులు అడగడంతో వాటికి సంబంధించిన వివరాలు నాకు తెలియదని తెలిపారు. లీజుకు తీసుకున్న వారిపై కూడా కేసు పెట్టడం జరిగిందని దానిపై పూర్తి వివరాలు పోలీసులు తెలుపుతారన్నారు. కేవలం తను కేసు పెట్టిన వివరాల మాత్రమే పోలీసులు విచారణ చేశారని దానిపై పూర్తి స్థాయి పేపర్లు,వివరాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఈ యొక్క కేసును నమోదు చేశారని ఒక రాజకీయ పరిస్థితులను ప్రజలు కూడా గమనిస్తున్నారని,అలాగే మీడియా పత్రిక మిత్రులు కూడా దీనిని అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయ కుట్రతోనే నాపై కూడా కేసు నమోదు చేసి ఇలాంటి విచారణలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఫామ్ హౌస్ లో జరిగినటువంటి కోడిపందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక సమాచారం కూడా నాకు పూర్తిగా తెలియదని ఆయన తెలిపారు.


Similar News