ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ మాయం.. నిందితుడు రిమాండ్
మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నిందితున్ని పట్టుకున్నట్లు ఆమనగల్ ఎస్సై వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ, ఆమనగల్లు ::- మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నిందితున్ని పట్టుకున్నట్లు ఆమనగల్ ఎస్సై వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024 డిసెంబర్ నెలలో ఆమనగల్లు మున్సిపాలిటీ విటాయిపల్లి గ్రామానికి చెందిన సభావత వాల్య తన మోటార్ సైకిల్ ను ఇంటి ముందు పార్క్ చేయగా, రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా, హైదరాబాద్ సరూర్నగర్ కి చెందిన హాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, హాజీ వ్యక్తి దొంగతనం ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని వద్ద ఉన్న మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని, మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.