నర్కుడలో మద్యం మత్తులో యాసిడ్ తాగి వ్యక్తి మృతి
హోలీ పండుగ సందర్భంగా మద్యం సేవించి అదే మత్తులో బాత్రూంలోని యాసిడ్ తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కుడ గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ, శంషాబాద్ : హోలీ పండుగ సందర్భంగా మద్యం సేవించి అదే మత్తులో బాత్రూంలోని యాసిడ్ తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కుడ గ్రామంలో చోటు చేసుకుంది. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామానికి చెందిన కమ్మరి ఆనంద్ చారి (62) శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా గ్రామంలో హోలీ ఆడి బయటకు వెళ్ళిపోయాడు. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు బాగా మద్యం తాగి ఇంటికి వచ్చి తాగిన మత్తులో రాత్రి 9:30 గంటల సమయంలో ఇంట్లోనే బాత్రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న యాసిడ్ తాగి బయటకు వచ్చాడు. మృతుడి భార్య కుమ్మరి లక్ష్మమ్మకు అనుమానం వచ్చి భర్త టీ షర్ట్ పై పడిన పసుపు రంగు చూసి బాత్రూం లోకి వెళ్లి చూడగా ఆసిడ్ డబ్బా మూత లేదు. యాసిడ్ డబ్బలో యాసిడ్ సగమే ఉంది. వెంటనే యాసిడ్ తాగాడని శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.