కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తాం.. మనోహర్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-08 14:15 GMT

దిశ, తాండూరు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో జరిగిన ప్రచారం ఉత్సహాంగా సాగింది. ఈ ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పట్టణంలోని మల్ రెడ్డిపల్లి నుంచి ప్రచారయాత్ర ప్రారంభమయ్యింది. ఈ ప్రచార యాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని హస్తం ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. మనోహర్ రెడ్డి ఇస్త్రీ చేస్తూ చిరువ్యాపారులను, ముసలవ్వలను పలకరించి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే ఆరు గ్యారంటీ లను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణను హస్తగతం చేసుకుంటామని చెప్పారు. పేదలందరికీ పక్కాఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయమని, ప్రజలంతా కాంగ్రెస్‌ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందంటే అమలుచేసి తీరుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. తాండూరు ప్రజలందరూ కాంగ్రెస్‌పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, సునీత సంపత్, లక్ష్మారెడ్డి, హబీబ్ లాల, ప్రభాకర్ గౌడ్, రావుఫ్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News