పరిగి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
పరిగి ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు.
దిశ, పరిగి: పరిగి ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. పరిగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో శనివారం రూ.1.42 కోట్లతో ఆసుపత్రికి జనరేటర్ ఏర్పాటుకు, కంపౌండ్ వాల్, మార్చురీ గది, మార్చురీ పక్కన షెడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మార్చురీ గది కట్టే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి, పూర్తి స్థాయి వైద్యులతో మెరుగైన వైద్య సేవలు అందించేందకు కృషి చేస్తానన్నారు.
అనంతరం ఆసుపత్రికి వచ్చే ఓపీ సంఖ్యలను వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే వారికి అందుబాటులో ఉండి సేవలు అందిస్తే రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. రోగుల సంఖ్య పెరిగితేనే ఆస్పత్రికి మరింత అప్ గ్రేడ్ చేసేందుకు వీలుంటుందని సూచించారు. ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్ ను పరిశీలించారు. డయాలసిస్ చేసే మిషినరీని పరిశీలించారు. ఐదు మిషన్ల ద్వారా ఎంత మందికి డయాలసిస్ చేయవచ్చని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ సెంటర్ ప్రారంభించేందుకు ముందుగా అర్జెంట్ గా రెండు రోజుల్లో జనరేటర్ సౌకర్యం కల్పించాలని సదరు కాంట్రాక్టర్ కు సూచించారు.
డయాలసిస్ రోగులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే జనరేటర్ తీసుకురావాలని కాంట్రాక్టర్ మరోసారి తెలిపారు. ఇందుకు స్పంధించిన కాంట్రాక్టర్ తీసుకువస్తానన్నారు. ఆస్పత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా వినియోగం లోకి తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఓ ప్రదీప్ కుమార్, సూపరిటెండెంట్ షాజీయా ఫరహానా, వెంకట రత్నం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్, కౌన్సిలర్లు మునీర్, ఎదిరె కృష్ణ, నాగేశ్వర్, నాయకులు కల్లు శ్రీనివాస్ రెడ్డి, రొయ్యల ఆంజనేయులు, బేతు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.