పరిగి టు సంగారెడ్డి… నిందితుల తరలింపు
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ దాడిలో నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించినట్లు తెలిసింది.
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ దాడిలో నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించినట్లు తెలిసింది. లగచర్ల, రోటి బండ తండా, పుల్ చెర్లకుంట తండా తదితర గ్రామాలకు 16 మంది నిందితులను పరిగి సబ్ జైలు లో రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నిందితులను గురువారం సాయంత్రం సంగారెడ్డి జైలుకు తరలించినట్లు తెలిపారు.