హాస్టల్‌లోని తొమ్మిది మంది బాలికలకు అస్వస్థత
మంచాల మండలంలోని కస్తుర్భా బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మంగళవారం రాత్రి ఆసుపత్రి పాలైయ్యారు. తొమ్మిది మంది విద్యార్థులకు రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే
దిశ, యాచారం : మంచాల మండలంలోని కస్తుర్భా బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మంగళవారం రాత్రి ఆసుపత్రి పాలైయ్యారు. తొమ్మిది మంది విద్యార్థులకు రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు , కడుపునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వసతి గృహం సిబ్బంది అనారోగ్యానికి గురైన విద్యార్థులను వెంటనే ఇబ్రహీంపట్నంలోని జీవన్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది.