MLA Prakash Goud : ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల
దిశ,గండిపేట్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని నియోజకవర్గం శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ వెల్లడించారు. నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయం వెనకాల ఉన్న విగ్నేశ్వర కాలనీకి రోడ్డు విషయమై పర్యవేక్షించారు. గతంలో విగ్నేశ్వర కాలనీకి నూతనంగా ఏర్పడిన మున్సిపల్ ఆఫీస్ పక్కనుంచి దారి ఉండేదని, ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు మూయించి వేశారు. దానివల్ల కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు ఎమ్మెల్యేకు వివరించడంతో ఆయన సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానికంగా విఘ్నేశ్వర కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ మేరకు తహశీల్దార్, మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్లతో మాట్లాడటంతో వారు సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టేలా చూస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మహేందర్ గౌడ్, కార్పొరేటర్లు సాగర్ గౌడ్, సురేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, అంతారం నరేష్ కుమార్ కాలనీవాసులు పాల్గొన్నారు.