సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెం.1 : ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో... MLA Anajaih Yadhav Speech

Update: 2023-03-25 10:46 GMT

దిశ, కేశంపేట్: సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామీగా నిలుస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. మండలంలోని ఎక్లాస్ ఖాన్ పేట్ గ్రామం బీఎస్సార్ గార్డెన్లో శనివారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, దళిత బంధు లాంటి అనేక ప్రజాకర్షక పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు కానీ ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ నిత్యావసర సరుకుల ధరలను పెంచి సామాన్య జనంపై పెనుబారం మోపుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై. రవీందర్ యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, వైస్ ఎంపీపీ అనురాధ, నాయకులు నర్సింగ్ రావు, లక్ష్మీనారాయణ గౌడ్, విశ్వనాథం, మధుసూదన్ రెడ్డి, యారం శేఖర్ రెడ్డి, యాదగిరిరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Tags:    

Similar News