పాపమని పదవులిస్తే ఎమ్మెల్యేనే వ్యతిరేకిస్తారా..?

అసమ్మతిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ, ఇతర పార్టీ నాయకులకంటే మీరే మా ఎమ్మెల్యేను మైనస్ చేయాలని చూస్తున్నారని, ఇలాంటివి మల్లీ పునరావృత్తం ఐతే ఎన్టీఆర్ చౌరస్తాలో బట్టలిప్పి కొడతామని ఎమ్మెల్యే వర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Update: 2023-04-01 10:57 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : అసమ్మతిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ, ఇతర పార్టీ నాయకులకంటే మీరే మా ఎమ్మెల్యేను మైనస్ చేయాలని చూస్తున్నారని, ఇలాంటివి మల్లీ పునరావృత్తం ఐతే ఎన్టీఆర్ చౌరస్తాలో బట్టలిప్పి కొడతామని ఎమ్మెల్యే వర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం స్థానిక పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గంలోని అన్నిమండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనంద్ ఎస్సీ, ఎస్టీ కేసులకు పూర్తి వ్యతిరేకం, అలాంటి నాయకుడి పై బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు అప్రజాస్వామికంగా అబద్ధాలు మాట్లాడుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.

ఎవరి పై ఎప్పుడు కేసులు పెట్టించారో ఆధారాలు బయటపెట్టాలి. ఇలాంటివి మల్లీ పునరావృత్తం ఐతే వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో బట్టలిప్పి కొడతామని ఘాటుగా స్పందించారు. అసమ్మతి అని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు అధిష్టానం టికెట్ ఇవ్వదని అసత్యపు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారికీ త్వరలో తగినబుద్ధి చెప్తాం. ఎమ్మెల్యే ఆనంద్ భిక్షతో నేడు పదవులు అనుభవిస్తూ, మళ్లీ ఆయనపైన విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా మారి ఎమ్మెల్యేను కలిసి మాట్లాడి ఆయన చేస్తున్న అభివృద్ధికి సహకరించండి. అంతేకాని ఎమ్మెల్యే ఆనంద్ కు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తామంటే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ మండలాల అధ్యక్షులు, వికారాబాద్ పట్టణ నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News