అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించండి: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.
దిశ, శంషాబాద్: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలారుదేవుపల్లి డివిజన్ ప్రేమవతి పేటలో నిర్మిస్తున్న యూత్ భవన నిర్మాణ పనులను గురువారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అభివృధ్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో నిర్ణీత సమయంలో త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ది పనులలో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. ప్రతి రోజు బస్తీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఎన్ని నిధులైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని దానికి అనుగుణంగా మిగిలి ఉన్న పనులన్నింటినీ అంచలంచెలుగా పూర్తి చేసి రాజేంద్రనగర్ సర్కిల్ ను గ్రేటర్ హైదరాబాద్ లోనే అన్ని ఆదర్శవంతమైన సర్కిల్ గా తీర్చి దిద్దడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం ఈఈ నరేందర్, నాయకులు ప్రేమ్ గౌడ్, రఘు యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.