మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీ లో కలపాలి : అఖిలపక్ష నాయకులు డిమాండ్

మహేశ్వరం మండలంలోని గ్రామ లన్నింటిని నూతనంగా ఏర్పాటు చేస్తున్న

Update: 2025-03-18 14:37 GMT
మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీ లో కలపాలి : అఖిలపక్ష నాయకులు డిమాండ్
  • whatsapp icon

దిశ,మహేశ్వరం: మహేశ్వరం మండలంలోని గ్రామ లన్నింటిని నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీ( ఫోర్త్ సిటీ)లో కలపాలని అఖిలపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం మహేశ్వరం మండల కేంద్రంలో సీనియర్ జర్నలిస్టు రఘుపతి,మనోహర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకుల,ప్రజా సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు.అనంతరం మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అఖిలపక్ష,జేఎసి నాయకులు మాట్లాడుతూ...హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మహేశ్వరం మండల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మహేశ్వరం ప్రాంతాన్ని వలస నేతలు అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారన్నారు.అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుపుకొని మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలలో ఫ్యూచర్ సిటీ జేఏసీ కమిటీ ద్వారా గ్రామాలల్లోకి వెళ్లి సభలు,సమీక్షలు పెడతామన్నారు.ఫ్యూచర్ సిటీలో ( ఫోర్త్ సిటీలో)మహేశ్వరం మండలాన్ని కలిపే వరకు పోరాటం చేస్తామన్నారు.అవసరమైతే శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో, ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు.మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ కమిటీలో అన్ని గ్రామాల నాయకులకు అవకాశం కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు శివ,పాండు నాయక్,రాయప్ప,రాజు నాయక్,కంది రమేష్, కృష్ణ నాయక్,యాదయ్య గౌడ్, పలువురు బీజేపీ, బీఆర్ఎస్,కాంగ్రెస్,సీపీఐ, సీపీఎం,కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ కమిటీ..

మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ కమిటీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ రఘుపతిని,గౌరవ అధ్యక్షులుగా కర్నాటి మనోహర్, వట్టెల మల్లేష్ యాదవ్,పాపయ్య గౌడ్,దత్తు నాయక్,ముఖ్య సలహాదారుడిగా కడారి జంగయ్య యాదవ్,సభ్యులుగా కాకి ఈశ్వర్, యాదిష్,వర్కల యాదగిరి గౌడ్, అలువాల రవికుమార్,ఆంధ్య నాయక్, కంది రమేష్,నరసింహ యాదవ్,కృష్ణ నాయక్,శ్రావణ్ కుమార్,కర్నాటి చంద్రకాంత్ ను ఎన్నుకున్నారు.కమిటీలో మండలంలోని ప్రతి గ్రామానికి చెందిన నాయకులకు అవకాశం కల్పిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.


Similar News