ప్రారంభ దశకు ఈకం కన్వెన్షన్.. అంతలోనే భారీ అగ్ని ప్రమాదం..

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ కన్వెన్షన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి వద్ద చోటుచేసుకుంది.

Update: 2025-03-20 07:06 GMT
ప్రారంభ దశకు  ఈకం కన్వెన్షన్.. అంతలోనే భారీ అగ్ని ప్రమాదం..
  • whatsapp icon

దిశ, శంషాబాద్ : ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ కన్వెన్షన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో 111 జీఓకు విరుద్ధంగా గత కొన్ని రోజుల నుండి అక్రమంగా ఓ కన్వెన్షన్ నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణం పూర్తయి ప్రారంభ దశకు వచ్చే క్రమంలో గురువారం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించి కన్వెన్షన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలు అదుపు చేసింది. దాదాపు 6 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈకం కన్వెన్షన్ కు ఎలాంటి ఫైర్ అనుమతి లేదు - డిస్టిక్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్..

నిర్మాణాలు ఏది చేపట్టిన ముందుగానే ఫైర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తొండుపల్లిలో నిర్మించిన ఈకం కన్వెన్షన్ నిర్మాణం పూర్తయి ప్రారంభ దశకు వచ్చినా ఇప్పటి వరకు ఫైర్ అనుమతి తీసుకోలేదని అన్నారు. ఫైర్ సెక్షన్ల కింద కన్వెన్షన్ యజమాని పై కేసు నమోదు చేశామన్నారు.

ఈకం కన్వెన్షన్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.. మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు

శంషాబాద్ మున్సిపాలిటీ పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉండడం వల్ల తొండపల్లిలో నిర్మించిన ఈకం కన్వెన్షన్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. అనేక సార్లు అక్రమ నిర్మాణం అంటూ నోటీసులు కూడా జారీ చేశామని వారి గురించి ఎలాంటి రిప్లై రాలేదన్నారు.

Similar News