అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఢీ అంటే ఢీ

అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.

Update: 2024-09-24 13:18 GMT

దిశ, మర్పల్లి : అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. తమ పార్టీ వారిని పోలీసులు వేధించారని బీఆర్​ఎస్​ నేతలు పేర్కొనగా చట్టం తమపని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్​ నాయకులు బదులిచ్చారు. దాంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    వివరాల్లోకి వెళితే ఓ కేసు విషయమై మర్పల్లి పోలీసులు పట్లూరు గ్రామానికి చెందిన ప్రవీణ్, నవీన్​ అనే అన్నదమ్ములను మంగళవారం ఉదయం విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు. ఈ సమయంలో వారు భయంతో పోలీస్ స్టేషన్ గోడదూకి పారిపోయారు. అనంతరం స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారంతా మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా

కక్ష సాధింపు చర్యలకు పాలపడుతున్నారని స్టేషన్ లో ఇద్దరు దళిత యువకులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చట్టం తనపని చేసుకుపోతుంది

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేష్ యాదవ్ తోపాటు కొంతమంది ముఖ్య నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. కేసుకు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకులని నిలదీశారు. దాంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

చట్ట ప్రకారమే చర్యలు : ఎస్ఐ సురేష్

చట్టపకారమే విచారణ జరిపామని, ఏ రాజకీయ పార్టీకి చట్టం చుట్టం కాదని ఎస్ఐ సురేష్ అన్నారు. ప్రతి కేసుకు రాజకీయం అంటగట్టడం తగదన్నారు.

Tags:    

Similar News