నడిరోడ్డుపై హద్దులు దాటిన ప్రేమికులు

నడిరోడ్డు పై ప్రేమికులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.

Update: 2024-09-24 15:38 GMT

దిశ, బడంగ్ పేట్​ : నడిరోడ్డు పై ప్రేమికులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాము ప్రైవేట్​గా ఉన్నామా? పబ్లిక్​లో ఉన్నామా? అన్న ధ్యాసే మరిచారు. పెళ్లయ్యాక పడకగదిలో చూసుకోవాల్సిన వ్యవహారం నడిరోడ్డుపై రన్నింగ్​ బైక్​పై ముద్దులు పెట్టుకుంటూ ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ న్యూసెన్స్​ చేశారు. ఈ ఘటన పహాడిఫరీఫ్​ ప్రాంతంలో ఒక కెమెరాకు చిక్కింది. ఈ వ్యవహారం అంతా సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. వివరాలలోకి వెళితే... హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ జంట బైక్‌పై వెళ్తూ కెమెరాకు చిక్కింది.

    చుట్టూ ఎవరూ లేరు అనుకున్నారో.. లేక ప్రేమలోకంలో ఉన్నామనుకున్నారేమో తెలియదు కానీ యువతి బైక్ ట్యాంకు మీద రివర్స్​లో కూర్చొని యువకుడికి ముద్దులు పెడుతూ కనిపించింది. ఇదంతా చూస్తున్న ఇతరులు సిగ్గుతో తలవంచుకోగా... మరొక వాహనాదారుడు మాత్రం వీరి వెకిలిచేష్టలను తన సెల్​ఫోన్​ లో చిత్రీకరించి సోషల్​ మీడియాలో వైరల్​ చేశాడు. ఇలాంటి వికృత చేష్టలను చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు వారు ప్రేమికులా? పెళ్లి చేసుకున్న నూతన జంటనా? అని ఇంకా తెలియాల్సి ఉంది. రోడ్డు మీద న్యూసెన్స్​ చేసిన ఈ జంట ఎవరు? అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.  

Tags:    

Similar News