నేతలు పార్టీ మారిన ఓటర్లు మారరు
రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో తలకొండపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వారి వారి స్వలాభాల కోసం పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఏమీ లేదని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
దిశ, తలకొండపల్లి : రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో తలకొండపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వారి వారి స్వలాభాల కోసం పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఏమీ లేదని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని సోమవారం వెల్జాల్ గ్రామానికి చెందిన వెంకటయ్య రాజు రాఘవేంద్ర ప్రసాద్ ఎల్లయ్య శ్రీనివాసులు అనే యువకులకు గులాబీ కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా అంతారం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన అంజయ్య కుటుంబసభ్యులను శ్రీనివాస్ యాదవ్ పరామర్శించి ఓదార్చి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత గ్రామాలలోని అధికార పార్టీలోని కొంతమంది నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షాలు ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయి, పార్టీలు మారడం హేయమైన చర్య అని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నాయకులు పార్టీ మారిన కానీ, ఓటర్లు మారని వారు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందారని, వచ్చే ఎన్నికల్లో అలాంటి నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి రామస్వామి, ఉపసర్పంచ్ జయమ్మ నాయకులు వెంకటయ్య, రాములు, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, యాదయ్య, సత్యం, శేఖర్, తిరుపతయ్య, భగవంతు, శ్రీశైలం, మల్లేష్ ,పరంజ్యోతి, చంద్రయ్య, నరేష్ గౌడ్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.