వైభవంగా లక్ష్మీ నరసింహ్మా స్వామి రథోత్సవం

మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి లక్ష్మీ నరసింహ్మా స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Update: 2025-03-14 13:01 GMT
వైభవంగా లక్ష్మీ నరసింహ్మా స్వామి రథోత్సవం
  • whatsapp icon

దిశ,మాడ్గుల : మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి లక్ష్మీ నరసింహ్మా స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుదర్శన కృష్ణ ఫౌండేషన్, ఆలయ కమిటీ చైర్మన్ గౌరవరం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో.. వేద పండితుల మంత్రోచరణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ పరిసరాలు స్వామివారి నామస్మరణతో మారుమోగాయి. అంతకుముందు గురువారం రాత్రి జానపద గాయకుడు జంగి రెడ్డి, గబ్బర్ సింగ్ సినీ కళాకారుల ఆటపాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు భక్తులకు, గ్రామ ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.

అత్యంత వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు చక్ర తీర్థ, దోపు కార్యక్రమాలతో పండితులు ముగింపు పలికారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి, డిసిసి ఉపాధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ ఎంపీపీ పద్మా రెడ్డి, బిజెపి మీడియా ప్రతినిధి నామ్ రాంరెడ్డి, ఎన్నారై గోవిందు, నాయకులు ఉడతల యాదయ్య గౌడ్, కొప్పుల జగన్ గౌడ్, కొప్పుల జగన్ గౌడ్, తోట చంద్రయ్య, కాసోజు విష్ణువర్ధనాచారి, తోట వెంకటయ్య,బిఆర్ఎస్ నాయకులు పల్లేటి యాదయ్య, గోవిందు, నరేందర్, తాజా మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, పెద్దయ్య వివిధ గ్రామాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News