దారుణం.. ప్రభుత్వ ఆసుపత్రిలో లేడీ స్టాఫ్ నర్స్ పై దాడి..

Update: 2024-08-16 15:06 GMT

దిశ, షాద్ నగర్ః కోల్ కత్తాలో మహిళా డాక్టర్ మీద జరిగిన దారుణాన్ని మర్చిపోకముందే.. షాద్ నగర్ లో ఇంకో ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ పై మరొక మహిళ దాడి చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాసరి ఆశ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది. అయితే గురువారం ఆశ తన విధులలో ఉండగా పట్టణంలోని బృందావన్ కాలనీకి చెందిన నీలం రేణిగుంట భార్గవి అనే మహిళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చి కుక్కకాటుకు వేసే సెకండ్ డోస్ ఇంజక్షన్ వేయమని అడిగింది. దానికి స్టాఫ్ నర్స్ ఆశ మొదటి డోస్ వేసిన చిట్టి తీసుకురావాలని తెలపగా అందుకు బయటకు వెళ్లిపోయిన భార్గవి మరల సాయంత్రం 6 గంటల 30 నిమిషాల సమయంలో ఆసుపత్రికి చేరుకుని వచ్చింది. ఏ మాత్రం మాట్లాడకుండా.. స్టాఫ్ నర్స్ ఆశను మాస్క్ తీయమని జుట్టు పట్టుకొని, చెప్పుతో దాడి చేసింది భార్గవి. వెంటనే పక్కన వున్న సిబ్బంది భార్గవి నుండి స్టాఫ్ నర్స్ ఆశను కాపాడారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో స్టాఫ్ నర్స్ ఆశ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భార్గవిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. స్టాఫ్ నర్స్ ఆశా పై దాడి చేసిన భార్గవిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు.

Tags:    

Similar News