సీఎం రేవంత్ రెడ్డి రాకతో సందడిగా మారిన కొడంగల్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి లో పర్యటన ముగించుకొని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్‌కు శనివారం రాత్రి చేరుకున్నారు.

Update: 2024-10-13 07:36 GMT

దిశ, కొడంగల్ (బొంరాస్ పేట్): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి లో పర్యటన ముగించుకొని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్‌కు శనివారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, కడా అధికారి వెంకట్ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, నాయకులు, పూల మొక్కలు అందజేసి, స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం తన నివాసంలో కార్యకర్తలు, ప్రజలు సీఎంను కలిసి, దసరా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్ సందడిగా మారింది. కార్యకర్తలను కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News