బీఆర్ఎస్, బీజేపీలు దొందే..

సీఎం కేసీఆర్ ఫార్మసిటీ కంపెనీల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద రైతుల భూములను కార్పోరేట్ శక్తులకు అమ్ముకొని కుంభకోణానికి పాల్పడుతున్నాడాని, ఫార్మసీటి భూములను కార్పొరేట్ శక్తులకు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు.

Update: 2023-02-19 15:20 GMT

దిశ, మహేశ్వరం : సీఎం కేసీఆర్ ఫార్మసిటీ కంపెనీల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద రైతుల భూములను కార్పోరేట్ శక్తులకు అమ్ముకొని కుంభకోణానికి పాల్పడుతున్నాడాని, ఫార్మసీటి భూములను కార్పొరేట్ శక్తులకు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం కందుకూరు మండలం సాయిరెడ్డి గూడ గ్రామంలో ప్రజా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫార్మసీటికి భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేద రైతులకు సమన్యాయం చెయ్యకపోవడం దురదృష్టకరమన్నారు. ఫార్మసీటి ఏర్పాటు చెయ్యడం వల్ల ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాల చెందిన పేద రైతులు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఫార్మసిటీ కోసం ఎకరాభూమికి 20 లక్షలకు కొనుగోలు చేసి, కోటి రూపాయలకు పైగా ఎకరా భూమిని కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నాయన్నారు. కేంద్రంలో బీసీ సామాజికవర్గం చెందిన వ్యక్తి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండి, బీసీ కులగణన చేయకపోవడం బీసీల దురదృష్టకరమన్నారు.

బీజేపి, బీఆర్ఎస్ పార్టీలకు బీసీలు కనిపించడం లేదన్నారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేను బహిర్గతం చేయాలన్నారు. సాయిరెడ్డిగూడ ప్రజాపార్టీ గ్రామ శాఖ అద్యక్షుడుగా ముద్దం రాములు యాదవ్, ఉపాధ్యక్షుడుగా వెంకటేష్ యాదవ్, జనరల్ సెక్రటరీగా శ్రీశైలం యాదవ్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్, మల్లేష్ యాదవ్, శేఖర్ యాదవ్, ప్రజాపార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News