kalwakurthy : కల్వకుర్తి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే
నేడు ప్రకటించనున్న బీఆర్ఎస్ మొదటి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో కల్వకుర్తి నియోజకవర్గం అభ్యర్థిగా, ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే అధిష్టానము జై కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
దిశ,ఆమనగల్లు ::- నేడు ప్రకటించనున్న బీఆర్ఎస్ మొదటి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో కల్వకుర్తి నియోజకవర్గం అభ్యర్థిగా, ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే అధిష్టానము జై కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం.గత పది రోజుల నుండి నియోజకవర్గంలో కల్వకుర్తి టికెట్ ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొందని, అధిష్టానము టికెట్ విషయంలో తర్జనభజన పడుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది.కానీ కల్వకుర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ను కలిగి ఉండడం సెట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు అనుకూలించాయి. దీంతో గత పది రోజుల నుండి జరుగుతున్న సందిగ్ధతకు నేటితో తెరపడనుంది.మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం, బలమైన క్యాడర్ ను కలిగి ఉండడం జైపాల్ యాదవ్ కు అనుకూలించాయి.
1954 ఆగస్టులో జన్మించిన జయపాల్ యాదవ్ 1981 నుండి 1995 వరకు కడ్తాల్ మండలం చెల్లంపల్లి సర్పంచ్ గా పనిచేశారు.1995లో తెలుగుదేశం పార్టీ నుండి తలకొండపల్లి జడ్పిటిసిగా ఎన్నికయ్యారు. అనంతరం 1997 నుండి 1999 వరకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు.1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతపురం 2006లో వంగూరు జడ్పీటీసీ గా పనిచేశారు.2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి రెండవసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు.
Read More : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సీఎం కేసీఆర్.. 115 మందితో జాబితా